Friday, September 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమా నమ్మకం నిజమైంది

మా నమ్మకం నిజమైంది

- Advertisement -

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడిగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి.. తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలియజేసింది. హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, ‘ఇందులో ఉన్న కంటెంట్ చూసి, ఇది ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు. ప్రేమ కథ, కుటుంబ భావోద్వే గాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతున్నాయి. ఇది నిజాయితీగా చేసిన సినిమా. నేను విదేశాల్లో చదువుకున్నాను. అందుకే ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడి ప్రయాణం, ఆ భావోద్వేగాలు, తండ్రితో జరిగే సంభాషణలు ఇవన్నీ నా మనసుకు దగ్గరయ్యాయి. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. ‘ఆదిత్య, కడలి పాత్రల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడు తున్నారు. తెరపై తమను తాము చూసుకున్నట్టు ఉందని ఎందరో నాకు మెసేజ్ లు చేశారు. మేమందరం నమ్మి చేసిన కొత్త ప్రయత్న మిది. ఈ సినిమాలో అబ్బాయి నిజాయితీగా కేర్ చూపిస్తాడు, ప్రేమిస్తాడు. అది అందరికీ నచ్చు తుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా బాగా నచ్చుతోంది’ అని వైష్ణవి చైతన్య చెప్పారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ‘సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా యువతకు బాగా నచ్చుతోంది. త్వరలో సీక్వెల్ ప్లాన్ చేస్తాం. కమర్షియల్ లెక్కలు వేసుకొని చేసిన సినిమా కాదిది, మనసుకి నచ్చి చేసిన ఇది. ఇదొక ప్రయోగాత్మక సినిమా’ అని తెలిపారు. ‘విదేశాల్లో చదువుకునే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నేను నిజ జీవితంలో చూసిన సంఘటనల నుంచే ఈ కథ రాసుకున్నాను. సినిమాకి స్పందన రావడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు ఆదిత్య హాసన్ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -