నవతెలంగాణ – జుక్కల్
ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో జుక్కల్ మండల టాపర్ గా నిలిచినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల – జుక్కల్ విద్యార్థిని జి. ముక్తేశ్వరికి బిసిటిఏ (బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్) వారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మల్లు రవి ఎంపి నాగర్ కర్నూల్, ఆర్. కృష్ణయ్య , ఎంపి రాజ్యసభ, సీనియర్ నాయకులు వి. హన్మంత రావ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులు గారికి అభినందిస్తూ కొనియాడారు. పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు మంచి విద్యను అందించి మండల టాపరుగా నిలిచి జుక్కల్ మండల గౌరవ మర్యాదలను రాష్ట్రస్థాయిలో నిలిచే విధంగా జుక్కల్ జడ్పీహచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయ బృందం కృషి చేశారని అన్నారు. మండల టాపర్ ముక్తేశ్వర్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో సన్మానించిన విషయం జుక్కల్ మండల ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కార్యక్రమంలో జుక్కల్ ఎంఈఓ తిరుపతయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. హనుమంత రెడ్డి మరియు ఉపాధ్యాయుల బృందం, తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎస్ఎస్ సీ టాపర్ కు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



