ఎమ్మెల్యే చుట్టు ప్రదక్షిణలు చేస్తున్న ఆశావహులు
నవతెలంగాణ-అచ్చంపేట
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యత గల పోస్టు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి. ప్రస్తుతం ఈ నెలలోనే చైర్మన్ పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ప్రధానంగా ముగ్గురు నేతలు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరు ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పదవిని దక్కించుకునేందుకు ఎవరికి వారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి మార్కెట్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉందని పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో పట్టణ, నియోజకవర్గం, మండలాల్లోని ప్రజలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోననీ జోరుగా చర్చించుకుంటున్నారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కేనో.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



