Sunday, August 2, 2026
E-PAPER
Homeఆటలుశ్రీలంక టెస్టులకు బుమ్రా దూరం..

శ్రీలంక టెస్టులకు బుమ్రా దూరం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025-27లో కీలకమైన పర్యటనకు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆదివారం బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. బుమ్రా స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. భారత జట్టు ఆగస్టు 4న శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. గాలేలో ఆగస్టు 15న తొలి టెస్టు, ఆగస్టు 23న కొలంబోలో రెండో టెస్టు జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -