Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులు

సురవరం సుధాకర్ రెడ్డికి ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌను 
సిపిఐ జాతీయ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు సూరవరం సుధాకర్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఆలేరు పట్టణంలో శనివారం సిపిఐ పార్టీ కార్యాలయంలో సురవరం చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్,మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పేరపు రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చౌడబోయిన పరుశురాములు, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు కందుల, ఏఐటీయూసీ మండల కో కన్వీనర్ గిరబోయిన స్వామి, భారత మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి మాధురి జానమ్మ, నర్సింలు లు, స్వామి, రాజు జాంగిర్ బి,హబీబ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -