Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసుద్దాల అశోక్‌ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

సుద్దాల అశోక్‌ తేజకు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ–లింగారెడ్డి స్మారక ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం-2026కు ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పురస్కార కమిటీ ఛైర్మన్‌ డా. బుర్ర మధుసూదన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం వెల్లడించారు.ఈ నెల 22న కరీంనగర్‌లో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టిబిడ్డలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -