Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుయూట్యూబర్‌ కు మరోసారి నోటీసులు

యూట్యూబర్‌ కు మరోసారి నోటీసులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితురాలైన యూట్యూబర్‌ రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. యూకేలో ఉద్యోగం కోసం ఓ కుటుంబం 2023లో కన్సల్టెన్సీ నిర్వాహకులకు తొలుత రూ.లక్ష, అనంతరం రూ.9.60 లక్షలు చెల్లించింది. ఉద్యోగం రాకపోవడంతోపాటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో ఈ ఏడాది జూన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రమానందనతోపాటు ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. బిగ్‌బాస్‌ షో ఎంపికల కోసం హైదరాబాద్‌ వచ్చిన రమానందన.. శుక్రవారం న్యాయవాదితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నోటీసులు తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -