Saturday, September 12, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకూలిన కొండచరియలు.. ముగ్గురు మృతి

కూలిన కొండచరియలు.. ముగ్గురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాంధీనగర్ సమీపంలోని తమ్మడి కేరె ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఇంటిపై మట్టి దిబ్బలు కూలిపోవడంతో మల్లికార్జున్ (30), ఆయన భార్య నాగవేణి (25), వారి నాలుగేళ్ల కుమారుడు సంతోష్ మట్టిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు జేసీబీలు, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. నిద్రలో ఉండగానే ఈ విషాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -