Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

- Advertisement -

రూ.6 వేల నగదు ,7 మొబైల్ ఫోన్లు 4 మోటర్ సైకిల్లు స్వాధీనం 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండలంలోని గాంధీనగర్ గ్రామ శివారులోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న స్థావరంపై మంగళవారం హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి పులి సిబ్బందితో కలిసి రైడ్ చేసి రూ 6 వేల నగదు ,7 మొబైల్ ఫోన్లు ,4 మోటర్ సైకిల్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ..గాంధీనగర్ మామిడి తోటలో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై రైడ్ చేసినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న జనగామ కమలాకర్ , సాటికేం రమేష్,  సల్లూరి పరుశురాం, కొండం సంపత్ రెడ్డి, చెట్ల సంజీవ్ , పిట్టల సంజయ్, కొమిరే పరుశరాములు కలిసి ఆడినట్లు తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం, ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, లేదా హుస్నాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -