Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రావుల వెంకటరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలి

రావుల వెంకటరెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – ధర్మసాగర్
భూ వివాదంలో కోర్టు ఆదేశాలను అతిక్రమించిన రావుల వెంకటరెడ్డి పై క్రిమినల్ కేసులు పెట్టాలని బీటెక్ స్టూడెంట్ రావుల నీరజ్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలోని తన నివాసంలో మీడియా,పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 1070/ ఎ/1/2 లో గల భూమి మా తాతల తండ్రుల నుంచి వారసత్వంగా ఉన్న భూమిని రావుల వెంకటరెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి తప్పుడు పత్రాలను సృష్టించి, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగిందని తెలిపారు. తప్పుడు సంతకాలతో అక్రమంగా ఫోర్జరీ సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో,స్థానిక కాజీపేట ఏ సి పి సమక్షంలో పొరనిక్స్ నివేదికను కోరడం జరిగిందని, ఇది వాస్తవమని, రావుల వెంకటరెడ్డి పై, కృష్ణా రావు లపై కేసులు నమోదు చేశారని తెలిపారు.

ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే ఇందుకు సంబంధించి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, పూర్తి నివేదిక ఇవ్వకుండానే ఈనెల 12వ తేదీన దౌర్జన్యంతో ఆ స్థలాన్ని జెసిబితో చదును చేయించడం జరిగిందన్నారు. ఈ విషయంపై ఆయనను ప్రశ్నించగా అనేక దుర్భాషలాడుతూ ఈ భూమి మీదికి వచ్చే హక్కు నీకు లేదని, వస్తే బాగుండదని, ఇక్కడే జెసిబి తో బొంద తీసి పాతి పెడతామని తీవ్రంగా హెచ్చరిస్తూ,తమపై దాడికి ప్రయత్నించడం జరిగిందన్నారు. ఇది ఇలా ఉండగా గత మూడు నెలల క్రితం ఆయనకు సంబంధించిన సహచరులతో తమ ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న మా అమ్మ పైన దుర్భాషలాడుతూ దాడి చేయించారని,ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేయడం జరిగిందని ఆరోపించారు.

రావుల వెంకటరెడ్డి తన అనుచరులతో మాకు ప్రాణం భయం ఉందని,ఇలాంటి వారిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన కొందరి నాయకుల అండదండలతో ఇప్పటివరకు వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమన్నారు. వీరి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని,వారి భారీ నుండి మమ్మల్ని రక్షించాలని, పోలీసులను ఈ సందర్భంగా ఆయన కోరారు. రానున్న రోజుల్లో నాకు గాని నా కుటుంబీకులకు కానీ ఎలాంటి ప్రమాదము జరిగిన దానికి కారకులైన రావుల వెంకటరెడ్డి వారి అనుచరులను చట్టపరంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీసులను ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -