కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి జిల్లా అప్పయ్యపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఐద్వా మహిళా నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శిగా చందన ఎన్నికయ్యారని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గద్వాల సాయిలీల, ఏ. లక్ష్మి తెలిపారు. ఈ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయబడిందన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ కాలనీ సమస్యలను ప్రస్తావించిందన్నారు. వీధి లైట్లు లేకపోవడం, తాగునీటి సరఫరా లోపం, బస్సు–ఆటో సౌకర్యాల కొరత, మురుగునీటి కాలువలు ఏర్పాటు, బోర్ కనెక్షన్ ఉన్నప్పటికీ తాగునీరు రాకపోవడం, కుక్కల బెడద, అలాగే హాస్పిటల్‌లో డాక్టర్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఈ సమస్యల పరిష్కారం కోసం ఐద్వా నూతన కమిటీ కృషి చేస్తామని, సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేంత వరకు ఐద్వా జెండా కింద పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు రేణుక, శాంతమ్మ, అర్చన, ఉపాధ్యక్షురాలు కౌసర్బేగం సభ్యులు నాగలక్ష్మి, చంద్రకళ, యాదమ్మ, మీనాక్షి, సుజని, జ్యోతి, మమత, శారద తదితరులు పాల్గొన్నారు.
అప్పయ్యపల్లి డబుల్ బెడ్ రూమ్ కాలనీలో ఐద్వా నూతన కమిటీ ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES