కల్లుగీత కార్మిక సమస్యను తక్షణమే పరిష్కరించాలి
కల్లుగీత కార్మిక సంఘం మహబూబాబద్ జిల్లా అధ్యక్షుడు యమ గాని వెంకన్న
ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న
నవతెలంగాణ – నెల్లికుదురు
కల్లుగీత కార్మిక సంఘం నెల్లికుదురు మండల కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యమగాని వెంకన్న గౌని వెంకన్నలు తెలిపారు. మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం సమస్యలు పరిష్కరించాలని సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన వీరగని మల్లేశం గౌడ్ ను కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా రామంజపురం గ్రామానికి చెందిన శీలం సత్యనారాయణ ను ఏకాగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
ఉపాధ్యక్షుడిగా పెరుమాండ్ల వెంకన్న, బైరు యుగంధర్, మండల సహాయ కార్యదర్శిగా కోటగిరి అశోక్, బత్తిని నవీన్ గౌడ్ ,సోషల్ మీడియా మండల కన్వీనర్ గా చీకటి వీరన్న గౌడ్, కోకన్వీనర్ గా పన్ను మహేష్, కమిటీ సభ్యులుగా శీలం లచ్చన్న, పల్లె వెంకటనారాయణ, బండపల్లి వెంకన్న, కోటగిరి గుంశాలి, స్వామి ,మెట్ల వీరన్న , గౌరవ అధ్యక్షులుగా రాగిపెల్లి వెంకన్న గొల్లపల్లి యాదగిరి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం నూతన మండల కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వాలని అన్నారు, ప్రతి సొసైటీకి కమిటీ భవనాలు ఇస్తూ పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాలను తక్షణమే విడుదల చేసి గౌడ కులస్తులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు, కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇస్తూ పేద గౌడ కులస్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ ఏర్పాటు కృషి చేయాలని అన్నారు రైతన్న బంధు పేరు తో పది లక్షల చొప్పున ఇవ్వాలని ప్రతి గౌడు కు మోటార్ బైకులు ఇవ్వాలని అన్నారు, కల్లుగీత కార్మికులకు 500 కోట్లు కేటాయించి గీతా కార్మికులను ఆదుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య నారాయణ యాదగిరి నగేష్ సుధాకర్ రమేష్ మల్లేశం చంద్రయ్య రామచంద్రయ్య శ్రీనివాస్ యాదవ్ కక్కర్ల లక్ష్మయ్య, తోపాటు వివిధ గ్రామాలకు చెందిన గౌడ కులస్తులు పాల్గొన్నారు.