డాలర్‌తో పోల్చితే 88.80కు క్షీణత
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కె ట్‌లో రూపాయి విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయికి పడి పోయింది. రూపాయి చరిత్ర లోనే ఎప్పుడూ లేని స్థాయిలో ఇంట్రాడేలో 88. 81కు పతన మయ్యింది. భారత్ పై అమెరికా వేసిన భారీ టారి ఫ్‌లతో దేశీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం నెలకొనడంతో రూపా యిపై ఒత్తిడి నెలకొందని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు డాలర్ల కొనుగోళ్లకు దిగుమతిదారులు మొగ్గు చూపడం, రూపాయి పతనాన్ని కట్టడి చేయడంలో మోడీ సర్కార్ విఫలం కావడం, స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి, ఎఫ్‌ఐఐలు తరలిపోవడం తదితర పరిణా మాలు దేశీయ కరెన్సీని రికార్డ్ కనిష్టానికి నెట్టాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 12 పైసలు పతనమై 88.80కి దిగజారింది. ఫారెక్స్‌్ మార్కెట్‌లో ఉదయం 88.73 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 88.81 అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఇంత క్రితం సెప్టెంబర్ 30న 88.80 కనిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఈ స్థాయిలో పడిపో వడం ఇదే తొలిసారి. రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్‌లో దిగుమ తులను భారం చేయనున్నాయి. మరోవైపు విదేశీ చెల్లింపుల భారం పెరిగిపోనుంది.
రూపాయి చారిత్రాత్మక పతనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES