తెలంగాణ నుంచి అర్హత సాధించిన తొలి స్కేటర్
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ యువ ఐస్‌స్కేటర్ ప్రణవ్ మాధవ్ సురపనేని (16) జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాడు. షార్ట్ ట్రాక్ ఐస్ స్కేటింగ్‌లో సత్తా చాటిన ప్రణవ్ మాధవ్ ఈ ఏడాది ఆఖర్లో కజకిస్తాన్‌లోని అస్తానా వేదికగా జరుగనున్న జూనియర్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. జూనియర్ వరల్డ్‌కప్‌కు భారత్ నుంచి ముగ్గురు అర్హత సాధించగా.. తెలంగాణ నుంచి ఈ ఘనత దక్కించుకున్న తొలి ఐస్ స్కేటర్ ప్రణవ్ మాధవ్ కావటం విశేషం. ‘సమ్మర్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించటం నా స్వప్నం. జూనియర్ వరల్డ్‌కప్‌లో ఆడటం ఈ ప్రయాణంలో తొలి అడుగు మాత్రమే. ప్రపంచకప్‌లో పతకం సాధిస్తాననే నమ్మకం ఉందని’ ప్రణవ్ మాధవ్ అన్నాడు.