Wednesday, October 15, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఆమె అదృశ్యం!

ఆమె అదృశ్యం!

- Advertisement -

– దేశంలో ఐదేండ్లలో 17.71 లక్షల మంది మహిళలు మాయం
– మధ్యప్రదేశ్‌లో 2,60,707 మంది మహిళలు మిస్సింగ్‌
– రాష్ట్రంలో 57,216 మంది ఆచూకీలేదు
– పిల్లలూ కనిపించట్లేదు
– ‘వెతుకులాట’లో పోలీసులు విఫలం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘ఆమె’ కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా 2018 నుంచి 2022 వరకు 17,71,695 మంది మహిళలు మాయం అయ్యారు. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో మహిళలు మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో పై ఐదేండ్లలో 2,60,707 మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఇప్పటికీ వారి జాడను కనుక్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. సదరు మహిళలు బతికి ఉన్నారో, మరణించారో తెలీదు. ఉమెన్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడి ఇతర దేశాలకు పంపేశారేమో అనే సందేహాలు లేకపోలేదు. అయితే ఈ ప్రశ్నల్లో దేనికీ ప్రభుత్వాల వద్ద సమాధానాలు లేవు. మహిళల మిస్సింగ్‌ కేసులు తెలంగాణలోనూ పెద్ద సంఖ్యలోనే నమోదయ్యాయి. ఐదేండ్లలో ఈ రాష్ట్రం నుంచి 57,216 మంది మహిళలు మాయం అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మిస్సింగ్‌ కేసులు అత్యధికంగా ఉన్నాయి. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్లో విస్తుగొలిపే ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎన్‌సీఆర్‌బీ నివేదికల్లోనూ ఈ గణాంకాలు ఉన్నాయి. ఇంత భారీ సంఖ్యలో మహిళలు అదృశ్యం కావడం వెనుక ఉన్న కారణాలను వెలికితీయడంలోనూ ప్రభుత్వాలు ఆసక్తి చూపక పోవడం ఆందోళన కలిగించే అంశమే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోలీస్‌స్టేషన్లు ఉన్నా, వాటిలో సరిపడా సిబ్బంది లేరు. ఉన్న వారిలో ‘పరిశోధన’ పరిమితంగా మారుతోంది. ఫలితంగా ‘ఆమె’ ఎవరికీ కనిపించకుండా పోతోంది. అలాగే చిన్న పిల్లల మిస్సింగ్‌ కేసులు కూడా దేశంలో లక్షల సంఖ్యలో ఉన్నాయి. వీటిని నియంత్రించడంలో ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమెన్‌, చిల్డ్రన్‌ ట్రాఫికింగ్‌ ముఠాల అకృత్యాలను కట్టడి చేయ డంలో పోలీసుల వైఫల్యం తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మహిళల మిస్సింగ్‌ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.

ఏటా పెరుగుతున్న కేసులు
చాలా పోలీస్‌ స్టేషన్లలో 14 ఏండ్లలోపు పిల్లలు అదృశ్యమైన కేసులు నమోదు అవుతున్నాయి. వీధుల్లోకి వెళ్లిన వారు, తిరిగి ఇంటికి రావడం లేదు. కొంత మంది సమాచారం పూర్తిగా తెలియకుండానే పోతోంది. 18 ఏండ్లలోపు వారు కూడా చాలా మంది అదృశ్యం అవుతున్నారు. మైనర్‌ బాలికల మిస్సింగ్‌ కేసులు కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -