Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఇద్దరు కవల పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

ఇద్దరు కవల పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య

- Advertisement -

కుటుంబ కలహాలే కారణం
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా బాలానగర్‌లో ఘటన


నవతెలంగాణ – బాలానగర్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని బాలానగర్‌ పారిశ్రామిక ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లల ఆరోగ్యం విషయంలో భర్తతో గొడవ కారణంగా ఓ మహిళ తన ఇద్దరు కవల పిల్లలను చంపేసి.. ఆపై ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి సీఐ నరసింహారాజు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీకి చెందిన సాయిలక్ష్మి(27), అనిల్‌ కుమార్‌ దంపతులు బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పద్మానగర్‌ ఫేజ్‌ 1లో నివాసం ఉంటున్నారు.

వారికి ఇద్దరు కవల పిల్లలు కార్తికేయ(2), లాస్య వల్లి(2) ఉన్నారు. కార్తికేయకు రెండేండ్లు వచ్చినా మాటలు రాకపోవడంతో కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో సాయి లక్ష్మి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కవల పిల్లలిద్దరినీ గొంతు నులిమి చంపింది. అనంతరం ఆమె ఇంటి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న బాలానగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -