Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగిరిజన కార్మికుల ఆకలి పోరాటం

గిరిజన కార్మికుల ఆకలి పోరాటం

- Advertisement -

ఆశ్రమ పాఠశాలల డైలీవేజ్‌ కార్మికుల 72 గంటల మహాధర్నా
రోడ్డుపైనే వంటావార్పు చలిలోనే నిద్ర

నవతెలంగాణ-భద్రాచలం
గిరిజన విద్యార్థులకు కడుపు నింపే ఆశ్రమ పాఠశాలల డైలీవేజ్‌ కార్మికులు ఆకలి పోరాటం చేస్తున్నారు. 32 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నుంచి 72 గంటలపాటు భద్రాచలం ఐటీడీఏ ఎదుట మహాధర్నా చేస్తున్నారు. పాత పద్ధతిలోనే జీతాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రతతోపాటు పలు సమస్యల పరిష్కారం కోసం 32 రోజులుగా సమ్మె బాట పట్టిన డైలీ వేజ్‌ కార్మికులు మహాధర్నాకు దిగారు. భద్రాచలం ఐటీడీఏ ఆవరణలోనే వంటావార్పు నిర్వహించారు.

చిన్న, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా తమ సమస్య పరిష్కరించే వరకూ కదిలేది లేదని రోడ్డుపైనే నిద్రిస్తున్నారు. సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బ్రహ్మాచారి కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం డైలీ వేజ్‌ కార్మికులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయమని అన్నారు. ఓవైపు వర్షం పడుతున్నా లెక్కచేయకుండా సోమవారం మొత్తం ధర్నాని కొనసాగించిన కార్మికులు మంగళవారం రాత్రి రోడ్డుపైనే నిద్రిస్తూ తమ నిరసన తెలుపుతున్నారని అన్నారు. 72 గంటల్లో ఈ సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -