బీజింగ్/సియోల్ : దక్షిణ కొరియా నౌకా నిర్మాణ సంస్థ హన్వా ఓషన్‌కి చెందిన ఐదు అమెరికా సంబంధిత అనుబంధ సంస్థలపై చైనా మంగళవారం ఆంక్షలను ప్రకటించింది. దీంతో ఆ కంపెనీ షేర్లు మంగళవారం కుప్పకూలాయి. అమెరికా అదనపు పోర్ట్ ఫీజులకు ప్రతిగా చైనా ఫీజులను ప్రకటించిన తర్వాత హన్వా ఓషన్ షేర్లు 5.3శాతం పడిపోయాయి. హెచ్‌డి హుందారు హెవీ షేర్లు 4.4శాతానికి పడిపోయాయి. చైనాలోని సంస్థలు, వ్యక్తులు ఈ హన్వాతో ఎటువంటి లావాదేవీలు, సహకారం లేదా సంబంధిత కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం విధించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. హన్వా ఓషన్ అమెరికా సంబంధిత అనుబంధ సంస్థలు అమెరికా దర్యాప్తు కార్యకలాపాలకు మద్దతు, సాయం అందించాయని పేర్కొంది. దీంతో చైనా సార్వభౌమాధికారం, భద్రత మరియు అభివృద్ధి ప్రయోజనాలను ప్రమాదంలో పడేశాయని ప్రకటన పేర్కొంది. తమ సముద్ర, లాజిస్టిక్స్, నౌకానిర్మాణ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుని అమెరికా తీసుకున్న చర్యలను అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక నిబంధనల తీవ్ర ఉల్లంఘనగా చైనా పేర్కొంది.
ఆగస్టులో, హన్వా ఫిల్లీ షిప్‌యార్డ్‌లో 5బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడిని ప్రయోగించింది. దక్షిణ కొరియా తన దేశీయ పరిమ్రను పునరుద్ధరించేందుకు అమెరికాకు 150 బిలియన్ డాలర్ల వరకు సాయం అందిస్తామని ప్రకటించిన తర్వాత 2024లో 100 మిలియన్ డాలర్లకు దానిని కొనుగోలు చేసింది. యుద్ధ నౌకల తయారీ కోసం చైనా కంటే వెనుకబడి ఉన్న ఫిల్లీ షిప్‌యార్డ్‌ను పునరుద్ధరించేందుకు జపాన్, దక్షిణ కొరియాల సాయం అవసమని ట్రంప్ యంత్రాంగం ప్రకటించిన తర్వాత హన్వా ఈ నిర్ణయం తీసుకుంది. హన్వా ప్రత్యర్థి సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థ అయిన హెచ్‌డి హుందారు హెవీ ఇండిస్టీస్ కూడా అమెరికా షిప్‌యార్డ్‌లను కొనుగోలు చేయడానికి బహుళ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు ఈ ఏడాది సెప్టెంబర్ రాయిటర్స్ మీడియా ప్రకటించింది. చైనాలోని షాన్‌డాంగ్‌లో హన్వా ఒక షిప్‌యార్డ్ నడుపుతోంది. ఇది నౌక భాగాల మాడ్యూల్స్‌ను నిర్మిస్తోంది. ఈ మాడ్యూల్స్‌ను కలిపేందుకు హన్వా దక్షిణ కొరియాలోని తమ షిప్‌యార్డ్‌కు సరఫరా చేస్తుంది.
నౌకా నిర్మాణ సంస్థ హన్వాపై ఆంక్షలను ప్రకటించిన చైనా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES