- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు
మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ అలియాస్ భూపతి మహారాష్ట్ర పోలీసుల ఎదుట బుధవారం ఉదయం లొంగిపోయారు.గడ్చిరోలిలో లొంగుబాటు సభ ఏర్పాటు చేసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు.ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు.వీరిలో కొందరు కీలక నేతలు ఉన్నారు.సభను లొంగుబాటు కార్యక్రమంలా కాకుండా, అభయ్ నోటితో సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయించి, వీరంతా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.
- Advertisement -