నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
తెలంగాణ యూనివర్సిటీలో బి.ఎడ్., ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎమ్ సంబంధించిన కోర్సులలో ఖాళీగా ఉన్నటువంటి సీట్లను భర్తీ చేయాలని కోరుతూ పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ యూ జిల్లా నాయకులు నసీర్ మాట్లాడుతూ, తెలంగాణ యూనివర్సిటీలో బి.ఎడ్, ఎల్.ఎల్.బి, ఎల్.ఎల్.ఎం. కోర్సులకు సంబంధించిన వాటిలో కాలీ సీట్లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
దూర ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితిలో, చదవాలని అనుకుంటున్నా విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందన్నారు. కాలే సీట్లను భర్తీ చేయడం వలన విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. యూనివర్సిటీలో వివిధ కోర్సులలో ఖాళీ సీట్లు నింపనట్లయితే ఆర్థిక భారం యూనివర్సిటీ మీద పడుతుందన్నారు. ఒకవేళ సీట్లను భర్తీ చేసినట్లయితే ఆర్థికంగా యూనివర్సిటీకి, అటు విద్యార్థులకు కూడా లాభదాయకమన్నారు. వెంటనే బి.ఎడ్,ఎల్.ఎల్.బి, ఎల్ఎల్ఎం కోర్సులకు సంబంధించిన కాలీ సీట్లను భర్తీ చేసి విద్యార్థులకు, యూనివర్సిటీకి న్యాయం చేయాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా నాయకులు వినోద్, వైష్ణవి, సృజన్, సుష్మా, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలింగ్ లో మిగిలిపోయిన ఖాళీ సీట్లను భర్తీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES