Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద మహిళకు చేయుత

నిరుపేద మహిళకు చేయుత

- Advertisement -

– లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అందజేత
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రానికి చెందిన నిరుపేద మహిళ సంపంగి మాధురికి లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో కుట్టు మిషన్ అందజేసి చేయూతనిచ్చారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి కార్యాలయంలో అధ్యక్షులు లుక్క గంగాధర్ చేతుల మీదుగా నిరుపేద మహిళ సంపంగి మాధురికి కుట్టు మిషన్ అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు లుక్క గంగాధర్ మాట్లాడుతూ .. ఇంటి పెద్ద దిక్కు భర్త బాలరాజ్ మృతి చెందడంతో తన ఇద్దరు పిల్లలను పోషిస్తూ సంపంగి మాధురి కుటుంబ భారాన్ని మోస్తుందన్నారు.

లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో నిర్వహించే స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి నిరుపేద మహిళలకు చేయూతను అందిస్తే స్వయం ఉపాధి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుందన్నారు. అందులో భాగంగానే మాధురికి కుట్టు మిషన్ అందించి లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి తరపున చేయూతనిచ్చినట్లు తెలిపారు. కుట్టు మిషన్ అందించి తన కుటుంబానికి బాసడగా నిలిచిన లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి సభ్యులకు మాధురి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కమ్మర్ పల్లి ప్రధాన కార్యదర్శి రేవతి గంగాధర్, కోశాధికారి తెడ్డు రమేష్, ఉపాధ్యక్షులు సున్నం మోహన్, కార్యవర్గ సభ్యులు నోముల నరేందర్, చింత ప్రదీప్, పాలెపు నరసయ్య, సురంగి చంద్రశేఖర్, చిలువేరి పవన్, సుంకరి విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -