Thursday, October 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తిమృతి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తిమృతి

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
ద్విచక్ర వాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన కుభీర్ మండలంలోని చాత గ్రామంలో బుధువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలపిన వివరాల ప్రకారం.. బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామానికి చెందిన కృష్ణ (41) మంగళవారం కుంటాల మండలంలోని లింబా బి గ్రామానికి సాయంత్రం పయణమయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో చాత గ్రామ శివారులో రైతులు రోడ్డుపై ఆరబోసిన సోయాపంటపై ద్విచక్ర వాహనపై వస్తున్న కృష్ణ అదుపు తప్పి పడిపోయాడన్నారు. దీంతో ఆయనకు తీవ్ర రక్తస్రావం జరిగిందిని తెలిపారు. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారని వివరించారు. అయితే ఆయన బుధవారం ఆస్పత్రిలోనే మృతి చెందాడని తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన రైతుపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ కృష్ణ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -