- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మండల పరిధిలో బుధవారం ఉదయం తెల్లవారుజామున విపరీతమైన పొగ మంచు కమ్ముకుంది. ఓవైపు రోడ్డు కనిపించడం లేదు.. మరోవైపు ఎదురుగా ఏ వాహనం వస్తుందో.. ఏ వాహనం ఎక్కడినుంచి వెళ్తుందో కనిపించక తీవ్ర అయోమయానికి గురయ్యారు. దట్టమైన పొగమంచు వల్ల రోడ్డుపై బండి నడపాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ పొగమంచు వల్ల రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చలికాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. ముందు ముందు శీతాకాలం తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు ఇప్పటినుంచే వణుకుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయం సుమారుగా 7: గంటల తర్వాత సూర్యుడు ఉదయించడంతో ఈ సమస్యకు చెక్ పడింది.
- Advertisement -