Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంతమిళనాడులో హిందీ భాషపై నిషేధం..?

తమిళనాడులో హిందీ భాషపై నిషేధం..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: త్రిభాషా విధానం పేరుతో తమిళనాడుపై కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ విధానం అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్నాయి. ద్విభాషా విధానానికే తమిళనాడు కట్టుబడి ఉందని సిఎం స్టాలిన్‌ పలుమార్లు స్పష్టం చేశారు. అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో తమిళనాడులో పూర్తిగా హిందీ భాషను నిషేధించే లక్ష్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హిందీ భాషను నిషేధిస్తూ అసెంబ్లీలో స్టాలిన్‌ ప్రభుత్వం ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదిత చట్టంపై చర్చించేందుకు మంగళవారం రాత్రి న్యాయ నిపుణులు, ప్రభుత్వం మధ్య అత్యవసర సమావేశం జరిగినట్లు సమాచారం. రాష్ట్రం అంతటా హిందీ హౌర్డింగ్‌లు, బోర్డులు, హిందీ సినిమాలు, హిందీ పాటలను నిషేధించే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజ్యాంగానికి లోబడే దీన్ని రూపొందించినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -