Friday, May 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుభార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య..

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ – కొండాపూర్: కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామం సమీపంలో గల రాంపూర్ తాండ రోడ్డుకు ఉన్న మామిడి తోటలో విషాద ఘటన చోటుచేసుకుంది. మారేపల్లి గ్రామానికి చెందిన దాసరి అంజయ్య (25), అతని భార్య దాసరి యాదమ్మ (20) గత 11 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బైక్ కొనివ్వలేదన్న విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో అంజయ్య తన భార్య యాదమ్మకు ఉరివేసి హత్య చేసిన అనంతరం, తాను కూడా చీరతో మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతురాలి తండ్రి సాయిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -