- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లోని ఓ కంపెనీలో మంగళవారం రాత్రి షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



