Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాడలెత్తించిన డీటీఓ 

హాడలెత్తించిన డీటీఓ 

- Advertisement -

స్కూల్ బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని పలు స్కూల్ బస్సుల్లో నల్గొండ డీటీఓ లావణ్య , మిర్యాలగూడ ఎంవీ ఐ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా స్కూల్ బస్సుల్లో అటెండర్లు లేకపోవడం, ఓవర్ లోడ్ ,ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేని 9 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు వారు తెలిపారు. అనంతరం ఎంబీఏ కార్యాలయంలో విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. విద్యా సంస్థల బస్సుల యజమానులు రవాణా శాఖ నిబంధనలు పాటించాలని… ప్రతి బస్సుకు ప్రాక్సిమిటీ మిర్రర్ ఏర్పాటు చేయాలని, అటెండర్ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాహన తనిఖీల్లో ఏఎంవిఐలు సోనిప్రియ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -