Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలి

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలి

- Advertisement -

-కొనుగోలు సందర్శనలో కలెక్టర్ హైమావతి రైతులకు పిలుపు
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన 
నవతెలంగాణ – బెజ్జంకి

జిల్లాలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని రైతులేవ్వరూ దళారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్ముకోవాలని..బ్యాంక్ అకౌంట్,ఫోన్ నెంబర్ లింక్, ఆధార్ అప్డేట్ చేసుకుంటే పేమెంట్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని కలెక్టర్ హైమావతి రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని ఏఎంసీ యందు ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.రైతులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను అధేశించారు.త్వరితగతిన వరిధాన్యం తరలించడానికి రైస్ మిల్లలను కేటాయించాలని డీసీఎస్ఓను అధేశించారు.

ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు.మండల కేంద్రంలో పలువురు లబ్దిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు.బిల్లులు వస్తున్నాయాంటూ లబ్దిదారులను కలెక్టర్ ఆరా తీశారు.సుమారు 4 లక్షల సహాయం అందిందని లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు.తహసిల్దార్ శ్రీకాంత్,ఎంపీడీఓ ప్రవీన్,ఆర్ఐ సంతోశ్,ఏపీఎం పర్శరాములు,సీసీలు తిరుపతి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -