నవతెలంగాణ- దుబ్బాక
ప్రస్తుత రోజుల్లో ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు విద్యతోపాటు ఏదేని ఓ వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎంఈఓ జే. ప్రభుదాస్ అన్నారు. బుధవారం దుబ్బాక మండలం తిమ్మాపూర్ లో జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల తల్లులకు ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు శిక్షణ ఇచ్చిన టైలరింగ్ కోర్సులకు సంబంధించి సర్టిఫికెట్ల ప్రధానం కార్యక్రమానికి ఎంఈఓ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఎర్త్ ఫౌండేషన్ కో ఫౌండర్ కలవేని శ్రీనివాస్, హెచ్ఎం పెంటయ్య, అమ్మ ఆదర్శ స్కూల్ కమిటీ చైర్మన్ సునీత తో కలిసి ఆయన పలువురు మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు. అంతకుముందు స్కూల్ విద్యార్థులకు ‘వాసన్ ఐ కేర్’, ‘మై క్లాస్ రూమ్’ వారి సహకారంతో విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ డైరెక్టర్ వెన్నెల, కోఆర్డినేటర్ రాజు, నిహారిక, టైలరింగ్ శిక్షకురాలు లతా పలువురు పాల్గొన్నారు.
విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి: ఎంఈఓ జే. ప్రభుదాస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES