- Advertisement -
నవతెలంగాణ – కట్టంగూర్
ఎదిగే పిల్లలకు పౌష్టికాహారం సరిగ్గా లభిస్తేనే వారు ఆరోగ్యవంతులైన పౌరులుగా తయారవుతారని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్. పద్మావతి అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మండలంలోని దుగునవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి బాలికలకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ ఉపాధ్యాయులు మురళయ్య, కరుణాదేవి, శ్రీనివాసరావు, వెంకటరెడ్డి ,సలీం,వెంకటకృష్ణ ,లీలావతి, పిఈటి సైదులు, అంగన్వాడి టీచర్స్ వాణి, ఎం.జ్యోతి, బి ఉప్పలమ్మ,కళమ్మ,ఈదమ్మ ఉన్నారు.
- Advertisement -