Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తనిఖీ బాధ్యతల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి 

తనిఖీ బాధ్యతల నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి 

- Advertisement -

ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్ 
నవతెలంగాణ – పాలకుర్తి

ఉపాధ్యాయులకు పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేసే బాధ్యతనుండి మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇమ్మడి అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అశోక్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తనిఖీలు చేస్తే విద్యార్థిని, విద్యార్థులకు పాఠాలను ఎవరు బోధించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం విద్యా విధానాన్ని కుంటూ పరచడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలల పర్యవేక్షణ బాధ్యత విద్యారంగ తిరోగమన చర్య అని అన్నారు.  విద్యారంగ సంక్షోభానికి దారితీస్తుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ ఉత్తర్వులను విరమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 24వేల 146 పాఠశాలలను తనిఖీ చేయడానికి పది సంవత్సరాల అనుభవం ఉన్న సుమారు 1473 మంది ఉపాధ్యాయులకు తనిఖీ బాధ్యతలు అప్పగించి, ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం పొడవునా వారిని తనిఖీ బాధ్యతలలో ఉంచడం వల్ల వారు సేవలందిస్తున్న ఆయా పాఠశాలలో బోధన కుంటుపడుతుందని అన్నారు.  విద్యా ప్రమాణాలు పడిపోతాయన. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమైన నిర్ణయం అని ఆరోపించారు. పర్యవేక్షణ బాధ్యతల నుండి ఉపాధ్యాయులను మినహాయించి విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -