Thursday, October 16, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

- Advertisement -

 నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి మహేష్ అండర్-17 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ నాగేష్ బుధవారం తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయిలో జరిగిన వాలీబాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి మహేష్ రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు.ఈ నెల 16 నుండి మూడు రోజులపాటు రంగారెడ్డి జిల్లాలో జరిగే 69వ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో విద్యార్థి మహేష్ పాల్గొంటారని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి మహేష్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య అభినందించారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థి మహేష్ ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -