రాస్తా ఫిల్మ్స్, ఔరాఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం తదితరులు నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాను రోహిత్ అండ్ శశి తెరకెక్కించారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. దర్శకులు సాయి రాజేష్, వెంకటేష్ మహా, రూపక్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దర్శకుడు రోహిత్ మాట్లాడుతూ,’ఇదొక క్రేజీ చిత్రం. ఇది మ్యాజికల్ హ్యాంగవుట్ సినిమాలా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. ‘రోహిత్-శశి మేకింగ్, స్టోరీ టెల్లింగ్ నచ్చి ఈ సినిమా నిర్మించాను. ఇదొక మంచి అనుభూతినిచ్చే చిత్రం అవుతుంది.
ఈ మూవీని చూస్తే గోవాకి వెళ్లి వచ్చినట్టుగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుంది’ అని నిర్మాత సాయి కుమార్ చెప్పారు. మరో డైరెక్టర్ శశి మాట్లాడుతూ, ‘రోహిత్‌కి, నాకు ఇది మూడో సినిమా. మూడు సిరీస్‌లను కూడా తీశాం. ‘హదయకాలేయం’, ‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి సినిమాలు నన్నెంతో ఇన్‌స్పైర్ చేశాయి. రూపక్ చేసిన ‘పరేషాన్’ నాకు చాలా ఇష్టం. ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్. నిర్మాత సాయి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు’ అని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ, ‘ఇది చాలా క్రేజీ ఫిల్మ్. మేం ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రిపేర్ అవ్వకుండానే ఆన్ సెట్‌లో చేసేశాం. కథ, విజువల్స్ పరంగా నా మ్యూజిక్ వచ్చింది’ అని అన్నారు.
యూనిక్ కాన్సెప్ట్‌తో ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’
- Advertisement -
- Advertisement -