Thursday, October 16, 2025
E-PAPER
Homeసినిమాఎమోషనల్‌ వార్‌, సైకలాజికల్‌ వైలెన్స్‌ని చూడబోతున్నారు

ఎమోషనల్‌ వార్‌, సైకలాజికల్‌ వైలెన్స్‌ని చూడబోతున్నారు

- Advertisement -

‘మిరాయ్’ లాంటి పాన్‌ ఇండియా బ్లాక్‌ బస్టర్‌ తర్వాత పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మ్యూజికల్‌ రొమాంటిక్‌ ఎంటర్టైనర్‌ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్‌. స్టైలిస్ట్‌-ఫిల్మ్‌ మేకర్‌ నీరజా కోన దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌, కృతి ప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ,’ఈరోజు చాలా బాధగా ఉంది. ఒక ఏడాదిగా చాలా రాడికల్‌, ఇంట్రెస్టింగ్‌ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నాను. ఒక వింత మనిషి బుర్రలో బతుకుతున్నాను. 17న సినిమా రిలీజ్‌ కాబోతుంది.

వరుణ్‌ అనే క్యారెక్టర్‌కి గుడ్‌ బై చెప్పేయాలి. నేను ఎందుకు ఆ క్యారెక్టర్‌ గురించి అంత పర్టికులర్‌గా చెప్తున్నానో సినిమా చూస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది. మన ఎమోషన్స్‌ మన కంట్రోల్‌లో ఉండాలని అర్థమవుతుంది. పవర్‌ కంట్రోల్‌ మనసులో మెయింటైన్‌ అవ్వాలి. ఇంకేమైనా డౌట్లు మిగిలిపోయి ఉంటే 17న థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి. ఈ సినిమాలో వరుణ్‌ అనే క్యారెక్టర్‌ ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్‌ వార్‌, సైకలాజికల్‌ వైలెన్స్‌ని జనరేట్‌ చేస్తాడు. అది నా ప్రామీస్‌. బెర్ముడా ట్రయాంగిల్‌ మీద నుంచి షిప్‌ వెళ్లిన, ఎయిర్‌ క్రాఫ్ట్‌ వెళ్ళినా దానిలోకి లాగేసుకుంటుంది. ఈ సినిమా కూడా అలాంటి లవ్‌ ట్రయాంగిల్‌. ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది’ అని తెలిపారు.

‘ఇది చాలా స్పెషల్‌ ఫిలిం. నాకు కథ చాలా నచ్చింది. ఇందులో రాగా అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. నీరజ అద్భుతంగా రాసింది. తన విజన్‌ మీ అందరికీ నచ్చుతుంది. మా ప్రొడ్యూసర్స్‌ విశ్వ, కృతికి థ్యాంక్స్‌’ అని హీరోయిన్‌ శ్రీనిధి శెట్టి చెప్పారు. మరో హీరోయిన్‌ రాశి ఖన్నా మాట్లాడుతూ,’నా మనసుకు చాలా దగ్గనైన సినిమా ఇది. ఇంత అద్భుతమైన క్యారెక్టర్‌ చేసేలా రాసినందుకు నీరజకి థ్యాంక్స్‌. సిద్దు, హర్ష, శ్రీనిధితోపాటు నన్ను ఒక కొత్త కోణంలో చూస్తారు’ అని తెలిపారు. డైరెక్టర్‌ నీరజ కోన మాట్లాడుతూ,’ మా నిర్మాతలు నాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేను ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం వారే. సిద్దు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. నిధి, రాశికి థ్యాంక్స్‌. ఈ ముగ్గురు సినిమాకి పిల్లర్స్‌. అద్భుతంగా పెర్ఫార్మ్‌ చేశారు. హర్ష క్యారెక్టర్‌ మీ అందరిని అలరిస్తుంది. జ్ఞాన శేఖర్‌ విజువల్స్‌, తమన్‌ మ్యూజిక్‌ ఈ సినిమాకి బిగ్‌ అసెట్‌’ అని తెలిపారు.

ఇది నాకు చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. ఈ కథ విన్నప్పుడే చాలా కనెక్ట్‌ అయ్యాను. తప్పకుండా మీరు కూడా కనెక్ట్‌ అవుతారని భావిస్తున్నాను. సిద్ధు, రాశి, నిధి అద్భుతంగా నటించారు. నీరజ మిమ్మల్ని కచ్చితంగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది. 17న అందరూ సినిమాని బిగ్‌ స్క్రీన్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.
నిర్మాత కృతి ప్రసాద్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -