Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజనచైతన్య వెంచర్‌లో హైడ్రా

జనచైతన్య వెంచర్‌లో హైడ్రా

- Advertisement -

19,878 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన వైనం
రూ.139 కోట్ల విలువైన భూమి స్వాధీనం, ఫెన్సింగ్‌ ఏర్పాటు


నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉప్పరపల్లి జనచైతన్య వెంచర్‌లో పార్కులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను బుధవారం హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్‌ ఫేజ్‌ 1, 2లో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు హైడ్రా విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్‌ 1,2 పేరుతో హుడా అప్రూవల్‌తో ఏర్పాటు చేసిన జనచైతన్య లేఔట్‌లో పార్కులు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జాలు జరిగినట్టు హైడ్రా నిర్ధారించింది. ఈ మేరకు బుధవారం ఉదయం జేసీబీల సాయంతో కబ్జాలను తొలగించింది. ప్రహరీలు నిర్మించుకుని వేసిన షెడ్డులను, రూమ్‌లను తొలగిం చారు. మూడు వేలు, వెయ్యి గజాలు, అయిదు వందల గజాల చొప్పున ఆక్రమించి నిర్మించిన షెడ్డులను నేలమట్టం చేశారు. ఆక్రమణల తొలగింపు తర్వాత వెంటనే ఫెన్సింగ్‌ నిర్మాణ పనులను హైడ్రా చేపట్టింది. కబ్జాదారుల నుంచి పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -