Tuesday, May 13, 2025
Homeఆదిలాబాద్దేశ రక్షణలో జవాన్‌ల సేవలు మరువలేనివి..

దేశ రక్షణలో జవాన్‌ల సేవలు మరువలేనివి..

- Advertisement -

సీఆర్పీఎఫ్ జవాన్ ఆర్క మేఘనాథ్ అంతః క్రియల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్..
నవతెలంగాణ – బజార్ హత్నూర్: దేశ రక్షణలో జవాన్‌ల సేవలు మరువలేనివని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ అన్నారు. మండలంలోని జాతర్ల గ్రామానికి చెందిన ఆర్క మేఘనాథ్ సీఆర్పీఎఫ్ జవాన్ జార్ఖండ్ లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ సోమవారం వారి స్వగ్రామం జాతర్లలో జరిగిన అంతః క్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేఘనాథ్ భౌతికకాయానికి పూల మాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుటుంబానికి దూరంగా వెళ్లి దేశ సేవ చేసే అవకాశం దొరకడం అదృష్టమని, అనారోగ్యంతో జవాన్ మేఘనాథ్ చనిపోవడం బాధాకరమని, మేఘనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని కోరారు. మేఘనాథ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గిరిజన శాఖ ద్వారా కుటుంబానికి న్యాయం జరిగిలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -