Thursday, October 16, 2025
E-PAPER
Homeఆటలుహర్మన్‌ప్రీత్‌ సేనకు జరిమానా

హర్మన్‌ప్రీత్‌ సేనకు జరిమానా

- Advertisement -

దుబాయ్: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌ల్లో 5 శాతం కోత విధిస్తున్నట్లు ఐసిసి బుధవారం ప్రకటించింది. నిర్దేశిత సమయంలోగా భారత బౌలర్లు ఓ ఓవర్‌ వెనుకపడి ఉండటంతో ఐసిసి ఈ జరిమానా విధించింది. ఐసిసి కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌లో ఆర్టికల్‌ 2.22 నిబంధన ప్రకారం నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయని ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు.

టోర్నీ ప్రారంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన టీమిండియా.. ఆతర్వాత వరుసగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయాలను చవిచూసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచే స్థితిలో నిలిచి మరీ ఓటమిపాలైంది. ముఖ్యంగా ఆసీస్‌తో మ్యాచ్‌లో భారత్‌ 330 పరుగులు చేసి మరీ ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా మహిళలతో మ్యాచ్‌లో బౌలర్ల వైఫల్యం కారణంగా చేతిలోకి వచ్చిన మ్యాచ్‌ చేజారింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ అక్టోబర్‌ 19న ఇండోర్‌లో జరుగనుంది. ఈ టోర్నీలో భారత్‌ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా జట్లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -