ఫొటోలు దిగే క్రమంలో ఘర్షణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ జేఏసీ నేతలు ఘర్షణకు దిగారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఎదుటే ఈ సంఘటన జరిగింది. బీసీ జేఏసీ నాయకులైన సత్యం, కృష్ణ బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పరస్ఫరం చేయిచేసుకున్నారు. ఇరువురు నేతల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఈనెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కలిసేందుకు బీసీ జేఏసీ నేతలతో పాటు ఆర్ కృష్ణయ్య బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బుధవారం వచ్చారు.
కాగా ఫొటోలు దిగేక్రమంలో ఇరువురు నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ అయ్యి ఉండి ఫొటోలు దిగేందుకు ఎలా ముందుకు వెళ్తావంటూ ఒకరిపై ఒకరు అరుస్తూ కొట్టుకునేవరకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆర్ కృష్ణయ్య రంగంలోకి దిగి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీల వాదన వినకుండా కోర్టు స్టే ఇచ్చిందని ఆయన వివరించారు. జనాభా లెక్కల అనంతరం బీసీ అభివృద్ధి జరుగుతున్నదన్నారు. ఈ బంద్‌ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఆఫీస్‌లో బీసీ జేఏసీ నేతల గొడవ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES