Thursday, October 16, 2025
E-PAPER
Homeజాతీయంయూఎస్‌కు పోస్టల్‌ సర్వీసులు పున:ప్రారంభం

యూఎస్‌కు పోస్టల్‌ సర్వీసులు పున:ప్రారంభం

- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికాకు అన్ని రకాల తపాల సేవలు మళ్లీ షురూ అయ్యాయి. బుధవారం నుంచి ఆ సేవలు పున:ప్రారంభించినట్టు భారతీయ తపాలా శాఖ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల బాదుడు నేపథ్యంలో ఆగస్ట్‌ 25 నుంచి అమెరికాకు పోస్టల్‌ సేవలు నిలిచిపోయిన విషయం విదితమే. అయితే దాదాపు రెండు నెలల విరామం తర్వాత అమెరికాకు బుధవారం నుంచి అన్ని రకాల పోస్టల్‌ సర్వీసులు తిరిగి ప్రారంభయ్యాయయని భారతీయ పోస్టల్‌ శాఖ వివరించింది. అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) మార్గదర్శకాల ప్రకారం భారత్‌ నుంచి వెళ్లే షిప్‌మెంట్స్‌ కన్సైన్‌మెంట్‌ విలువలో 50 శాతం కస్టమ్స్‌ డ్యూటీ వర్తిస్తుందని వివరించింది. పోస్టల్‌ ఐటమ్‌లపై ప్రోడక్టును బట్టి సుంకాలు విధించడం లాంటివి ఉండదని స్పష్టం చేసింది. దీంతో చిన్న వ్యాపారులు, ఈ-కామర్స్‌ ఎగుమతిదారులతో పాటు సంబంధిత వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పోస్టల్‌ శాఖ పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -