Thursday, October 16, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ తెచ్చిన తంట

ట్రంప్‌ తెచ్చిన తంట

- Advertisement -

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో కష్టమే
ప్రపంచ దేశాలపై అధిక ప్రభావం
ఆర్థిక వ్యవస్థ, సరఫరా చైన్‌ దెబ్బతినే ప్రమాదం
యూఎస్‌ ప్రజలపై కూడా భారం
హెచ్చరిస్తున్న నిపుణులు, విశ్లేషకులు

వాషింగ్టన్‌ : అమెరికాకు రెండోసారి అధ్యక్షుడైన తర్వాత డోనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుం టున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను గందర గోళంలోకి నెట్టేస్తున్నాయి. అమెరికా ప్రయోజ నాలకే ప్రాధాన్యమంటూ ఇతర దేశాలపై మెడపై కత్తి పెడుతున్నాడు ట్రంప్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు వరకు భారత్‌ వంటి దేశాలను పొగిడిన ట్రంప్‌.. ఇప్పుడు అధ్యక్షుడి గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన నిజ స్వరూపాన్ని బయటపెట్టారు. భారత ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడు అంటూనే.. ఎడాపెడా సుంకాలు విధించాడు. ఆంక్షలతో బెదిరిస్తున్నాడు. దీంతో ఇటు భారత్‌ వంటి దేశాల్లోని ఎగుమతిదారులు, అటు అమెరికా లోని వినియోగదారులు ట్రంప్‌ టారిఫ్‌ ఎఫెక్ట్‌ తో ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచంలో తనకు ఎవరు పోటీగా వచ్చినా తట్టుకొని అమెరికా.. తన పట్టు కోసం ఎంతకైనా తెగి స్తుంది. అందుకు ప్రస్తుతం ట్రంప్‌ నేతృత్వం లోని అమెరికా.. చైనాతో వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

భారత్‌, చైనాలు ఆసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు. అంతేకాదు.. ప్రపంచంలో అమెరికాకు గట్టి పోటీని ఇస్తున్నది చైనానే. క్రీడారంగం నుంచి శాస్త్రీయ రంగం వరకు.. ఇలా ప్రతీ రంగంలోనూ చక్కని ప్రతిభ కనబరుస్తూ అమెరికాకు సవాల్‌ విసురుతున్నది. ప్రపంచం లోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనా.. యూఎస్‌కు గట్టి పోటీని ఇస్తు న్నది. ఈ విధంగా చైనా సాధిస్తున్న విజ యాలు ట్రంప్‌నకు రుచించటం లేదనీ, అందుకు చైనాను టార్గెట్‌ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. చైనాపై ట్రంప్‌ విధించిన వంద శాతం టారిఫ్‌ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్తున్నారు.

ఇబ్బడి ముబ్బడిగా టారిఫ్‌లు విధిస్తూ, ట్రేడ్‌ వార్‌కు తెరలేపిన ట్రంప్‌.. యావత్‌ ప్రపంచాన్ని అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టేస్తు న్నారు. చైనాను టారిఫ్‌లు, ఆంక్షలతో రెచ్చ గొడుతూ.. దానిని ప్రపంచ సమస్యగా మార్చు తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ రెండు దేశాల మధ్య ముదిరిన ట్రేడ్‌వార్‌.. ఆ తర్వాత సద్దుమణిగిన విషయం విదితమే. ఇక రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్న తరుణంలోనే ట్రంప్‌.. చైనాపై వంద శాతం సుంకాలు విధించటం గమ నార్హం. తన నిర్ణయంతో ట్రంప్‌ మళ్లీ ట్రేడ్‌వార్‌కు అగ్గిరాజేశారని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్న ఈ రెండు దేశాల మధ్య ఇలాంటి పరిస్థితులు ఇతర దేశాల పైనా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు గ్లోబల్‌ సప్లరు చైన్‌లు దెబ్బతినే ప్రమాదమున్నదని వారు హెచ్చరిస్తున్నారు. అరుదైన భూఖనిజాలు, సాంకేతిక ఎగుమతులు, టారిఫ్‌లు అనే అంశాలపై యూఎస్‌, చైనాల మధ్య ప్రస్తుతం ఘర్షణ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలూ తీసుకుంటున్న కఠినమైన ఆర్థికపరమైన చర్యలపై వాణిజ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థ, మార్కెట్లపై ప్రభావం
ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులు ప్రపంచ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టాయి. యూఎస్‌ స్టాక్‌ మార్కెట్‌లు వేగంగా పడిపోయాయి. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విషయంలో మదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రిప్టోకరెన్సీ నిరాకరణకు గురైంది. అయితే ఈ టారిఫ్‌ల అమలు చైనా కంటే అమెరికాకే తీవ్ర ప్రమాదకరమని వాణిజ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకాల విధింపులతో అమెరికాలో వస్తువులు మరింత ప్రియం అవుతాయనీ, ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చని ఆర్థికవేత్తలు అంటున్నారు. తన టారిఫ్‌లతో చైనా రాజీమార్గాన్ని అనుసరిస్తుందన్న ట్రంప్‌ లెక్కలు లక్ష్యాన్ని చేరలేవని నిపుణులు చెప్తున్నారు. అమెరికన్లు ఎక్కువగా ఆధారపడేది చైనా గూడ్స్‌ పైనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు. యూఎస్‌ వద్దనుకుంటే.. చైనాకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇక యాంటీ బయాటిక్స్‌, టంగస్టన్‌, ఇంకా ఇతర వస్తువులు, మూలకాల కోసం యూఎస్‌.. చైనా మీదే ఆధారపడి ఉన్నది. ఈ విషయంలో ఇతర దేశాల నుంచి కూడా అమెరికాకు మద్దతు లభించదనీ, ఎందుకంటే వాటి పైనా ట్రంప్‌ సుంకాలు విధించారని విశ్లేషకులు చెప్తున్నారు.

యూఎస్‌ తీసుకున్న చర్యలేంటి?
చైనా టార్గెట్‌గా ట్రంప్‌ టారిఫ్‌లు విధించారు. చైనాకు చెందిన అన్ని గూడ్స్‌పై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తూ ప్రకటన చేశారు. నవంబర్‌ 1 లేదా చైనా తీసుకునే తదుపరి నిర్ణయాలను బట్టి గడువు తేదీ కంటే ముందే సుంకాల అమలు ఉండొచ్చని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా.. చైనాపై విధించిన 30 శాతం సుంకం ఇప్పటికే అమలులో ఉన్నది. దీంతో చైనా వస్తువులు కొన్నిన 130 శాతం సుంకాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక చైనాపై సాంకేతికంగానూ చర్యలకు ఉపక్రమించింది అమెరికా. చైనాకు సెమీకండక్టర్లు, సాఫ్ట్‌వేర్‌ వంటి సాంకేతిక ఎగుమతులను పరిమితం చేసింది.

చైనా వాదన
అరుదైన భూఖనిజాల విషయంలో ప్రపంచంలో చైనా ఆధిపత్యం ఉన్నది. ఈ ఖనిజాలు ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ వాహనాలు, రక్షణ వ్యవస్థలో ఎంతో కీలకం. ఏదైనా ప్రోడక్ట్‌.. 0.1 శాతం చైనీస్‌ అరుదైన భూఖనిజాలను, చైనీస్‌ టెక్నాలజీని వినియోగించిన.. చైనా నుంచి లైసెన్స్‌ పొందాల్సిన అవసరం ఉంటుంది. ఇది డిసెంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్నది. యూఎస్‌ షిప్‌లపై చైనా స్పెషల్‌ పోర్ట్‌ ఫీజును చేర్చింది. అయితే తాము తీసుకున్న ఈ చర్యలు చట్టబద్ధం, రక్షణాత్మకమైనవని.. ఇందులో ఎలాంటి దూకుడూ లేదని చైనా స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -