Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఖర్గేను పరామర్శించిన మంత్రి దామోదర

ఖర్గేను పరామర్శించిన మంత్రి దామోదర

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల మల్లికార్జున ఖర్గేకు వైద్యులు పేస్‌మేకర్‌ అమర్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -