Thursday, October 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐటీడీఏ పీఓ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

ఐటీడీఏ పీఓ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మధు
– 220 మంది కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మికుల ఆందోళన
నవతెలంగాణ-ఆదిలాబాద్‌

ఐటీడీఏ పీఓ కార్మికుల గోడు వినాల్సింది పోయి నిరంకుశంగా కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గర్హనీయమని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న డైలీవేజ్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు సమ్మె బాట పట్టారు. ఇందులో భాగంగా సోమవారం 72 గంటల నిరవధిక సమ్మె ప్రారంభించారు. సమస్యలు పరిష్కరిం చాల్సింది పోయి ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా సుమారు 220 మంది కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ బుధవారం సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఐటీడీఏ ముట్టడి చేపట్టారు. వర్షంలోనూ తడుస్తూ డైలీవేజ్‌ కార్మికులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. కార్మికులు కోరేవి గొంతెమ్మ కోరికలు కావన్నారు. హాస్టల్‌ పిల్లల బాగోగులు చూసుకునే కార్మికులు సమస్యలను పరిష్కరించాలని 72 గంటల ధర్నా చేస్తే పీఓ టెంట్‌ వద్ద కరెంట్‌ కట్‌ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల మొండిగా వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వం అధికారులను ముందు పెట్టి కార్మికులకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా కార్మికులతో కలిసి కమిషనరేట్‌, సెక్రటేరియట్‌ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్య క్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, సీపీఐ(ఎం) ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్‌, సీఐటీయూ జాతీయ కౌన్సిల్‌ మెంబర్‌ త్రివేణి, ఆదిలాబాద్‌ జిల్లా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్‌, కుమురం భీం జిల్లా సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు జాదవ్‌ రాజేందర్‌, ముంజం శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమాచారి, తెలం గాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్‌ డైలీవేజ్‌, పార్ట్‌ టైం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు టేకం ప్రభాకర్‌, కుమురం భీం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తొడసం వసంత రావు, ఆడ శ్యామ్‌రావు, కోశాధికారి మరప రాంబాయి, జిల్లా నాయకులు శ్యామల, పుష్ప, తార, లక్ష్మి, ఈరాబాయి, గిరిజన సంఘం మండల కార్యదర్శి మడావి నాగోరావ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -