Thursday, October 16, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఫాంహౌస్ లో పబ్ కల్చర్..

ఫాంహౌస్ లో పబ్ కల్చర్..

- Advertisement -

మద్యం సేవించి అశ్లీల నృత్యాలు
ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని ఫాంహౌస్ లో రేవ్ పార్టీ
బుధవారం అర్ధరాత్రి నుంచి హల్చల్ 
పక్కా సమాచారాలతో పోలీసుల దాడులు
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఏసిపి కేపీవీ రాజు
నవతెలంగాణ- ఇబ్రహీంపట్నం 

ఫాంహౌస్ లో పబ్ కల్చర్ కొనసాగుతోంది. మద్యం సేవించి, యువతి, యువకులు అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఘటననే ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని ఫాంహౌస్ లో వెలుగు చూసింది. రేవ్ పార్టీలో బుధవారం అర్ధరాత్రి నుంచి హల్చల్ చేస్తున్న 25మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫాంహౌస్ పై మంచాల పోలీసులు దాడులు నిర్వహించారు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు వీరిలో 8 మంది యువతులు ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించి స్థానికుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, లింగంపల్లి గ్రామ సమీపంలోని సప్తగిరి ఫాంహౌస్ లో బుధవారం రాత్రి కిట్టి పార్టీ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా రేవ్ పార్టీని నిర్వహిస్తున్నారు.

కిట్టి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న పార్టీకి నగరం నుంచి 25 మంది యువత, యువకులు పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఒక్కసారిగా కార్లలో సదరు ఫామ్ హౌస్ లోకి కొనసాగుతున్న పార్టీపై మంచాల పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారంతో ఎస్ఐ నాగేశ్వర్ రావు, తన పోలీసు సిబ్బందితో దాడి నిర్వహించారు. 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 8 మంది  మంది యువతులు ఉన్నట్లు సమాచారం. వీరి నుంచి రూ. 2 లక్షల 45 వేలు, 11 కార్లు, 25 మొబైల్స్, మూడు ఫుల్ మద్యం బాటిల్స్, 18 బీర్ బాటిల్స్, మూడు బ్రీజర్స్ బాటలను స్వాధీనం చేసుకున్నారు. కాగా పట్టుబడిన కార్లలో ఒక కారుకు ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -