Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్18న జరిగే రాష్ట్ర బంద్ జయప్రదం చేయండి 

18న జరిగే రాష్ట్ర బంద్ జయప్రదం చేయండి 

- Advertisement -

అఖిలపక్ష బిసి నాయకుల పిలుపు 
నవతెలంగాణ – ఆలేరు టౌను 

42% శాతం బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ సంఘ నాయకులు ఈనెల 18వ తేదీన రాష్ర్ట బంద్ కు పిలుపునిచ్చారు. దీనిని విజయవంతం చేయాలని కోరుతూ.. ఆలేరు పట్టణంలో గురువారం  ప్రజల సంపూర్ణ మద్దతు, భాగస్వామ్యం కావాలని బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్ కవిడే మహేందర్, నియోజకవర్గం అధ్యక్షులు పేరేపు రాములు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బిసి అఖిలపక్ష కమిటీ సభ్యుల సమావేశం గెస్ట్ హౌస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమన్నారు. బీసీల నోటికాడి ముద్ద లాకోడమేనని అన్నారు. ఈ డబ్ల్యూ ఎఫ్ రిజర్వేషన్లు సందర్భంగా 50% శాతం సీలింగ్ను సుప్రీంకోర్టు ఎత్తివేసిందన్నారు. సమయం సందర్భాన్ని 50 శాతం సడలించాలని ఆదేశాలు ఉన్నాయని అన్నారు. మండల్ కమిషన్ కేసులో కూడా రాజకీయ, విద్యా, ఉద్యోగాల మెరిట్ ఉంటుందని చెప్పారు. రిజర్వేషన్లు 42% తగ్గించి ఎన్నికలకు పోతే  ,ఎట్టి పరిస్థితులలో బీసీ సంఘాలుగా, అంగీకరించబోమని వారు వివరించారు.

 ఈ కార్యక్రమంలో అఖిలపక్ష బీసీ సంఘం నాయకులు మంగ నరసింహులు, ఆర్ జనార్ధన్, చెక్క వెంకటేష్ , పూల నాగయ్య, బొమ్మకంటి బాలరాజు, మంద సోమరాజు, పుట్ట మల్లేశం,  కల్లెపు అడవయ్య, కాదూరి అచ్చయ్య,  మొరిగాడి   చంద్రశేఖర్, కందుల శంకర్, పద్మ సుదర్శన్, ఎలుగల కుమారస్వామి, జంపాల దశరథ, పరిగెల రాములు, నందగంగేష్, రచ్చ రామ్ నరసయ్య, భేతి రాములు, తుంగ కుమార్, చిరబోయిన కొమరయ్య, కొల్లూరు రాజయ్య, నల్లమాస తులసయ్య, భర్మ బాబు, గుండు జగన్మోహన్, దయ్యాల సంపత్, డొంకెన బిక్షపతి, మంచన మల్లేశం, పోతుగంటి  సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -