Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: సీపీ సాయిచైతన్య

షార్ట్ ఫిలిం పోటీలకు ఆహ్వానం: సీపీ సాయిచైతన్య

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
శాంతి భద్రతల, సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్ధం అక్టోబర్ 21 జరుగు పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ, షార్ట్ ఫిలిం తీయడానికి నిజామాబాద్, ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని ఆసక్తి గల యువతకు జౌత్సహిక ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ముందుకు రావాలని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య గురువారం తెలిపారు. ఇందులో భాగంగా 2024 అక్టోబర్ నుండి 2025 అక్టోబర్ వరకు అత్యవసర సమయాల్లో పోలీసు లు సేవలు, ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల విధులు, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, మత్తు పదార్థాల నిషేదంలో పోలీసుల కృషి, ఇతర సామాజిక రుగ్మతలు మొదలగు పోలీసుల త్యాగాలు, పోలీసు విధుల్లో ప్రతిభను తెలిసే విధంగా ఉండే తీసిన (3) ఫోటోలు, తక్కువ నిడివి ( 3 నిమిషాలు )గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్ర స్థాయి పోటీల కోసం ఈ నెల 24 తేదీ సాయంత్రంలోగా కమిషనరేటు పోలీస్ కార్యాలయంలోని పోలీస్ పి.ఆర్.ఓ కి అందజేయాలన్నారు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు. 10 x 8 సైజ్ ఫోటోలను షార్ట్ ఫిలింను, పెన్ డ్రైవ్ (Pendrive)లో మీ యొక్క పూర్తి వివరాలతో అందజేయాలని, కమిషనరేటు స్థాయిలో ఎంపిక అయిన మూడు షార్ట్ ఫిలింలను, ఫోటోలను రాష్ట్రస్థాయి పోటీల గురించి రాష్ట్ర డి.జి.పి. ఆఫీస్, హైదరాబాద్ కు పంపించడం జరగుతుందన్నారు. మరిన్ని వివరాల కోసం 94400- 01827 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -