Tuesday, May 13, 2025
Homeఆదిలాబాద్బోరిగాంలో ఉద్రిక్తత..

బోరిగాంలో ఉద్రిక్తత..

- Advertisement -

ఎస్పీ రంగ ప్రవేశంతో సద్దుమణిగిన వివాదం..
నవతెలంగాణ – ముధోల్
: ముధోల్  మండలంలోని  బోరిగాం గ్రామంలో హనుమాన్ విగ్రహం సమీపాన సోమవారం ఉదయం ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహం ప్రతిష్టించడంతో గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలోని ఇరు గ్రూపులు  రాళ్లతో దాడి చేసుకున్నారు ‌.ఈ దాడిలో  పలువురు గాయపడ్డారు. వారిని బైంసా ఆస్పత్రికి తరలించారు. ఈవిషయం తెలుసుకున్న ముధోల్ పోలిసులతో పాటు, నిర్మల్ జిల్లా నుండి ఎస్ఐ లు, సిఐ లు పోలిసులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.  అలాగే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వెంటనే తనతో పాటు ఇటివల మహిళా కానిస్టేబుల్ తో ఏర్పాటు చేసిన శివంగీ టీంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో  ఎక్కువ మంది గూమిగూడిన గ్రామ మహిళలను మహిళా పోలిసులు చెదరగొట్టారు. ఎస్పి, అడిషనల్ ఎస్పీ అవినాష్ కూమార్, భైంసా ఆర్టీవో కోమల్ రేడ్డి, తహశీల్దార్ శ్రీకాంత్ రంగంలోకి దిగి ఇరు గ్రూపులను సముదాయించారు.  వారు వినకపోవడంతో పరిస్థితి చేయి దాటకుండా ఎస్పీ చాకచక్యంగా వ్యవహరించి వెంటనే సంఘటన స్థలం నుండి తమ పోలిస్ సిబ్బందితో  ఇరుగ్రూపులను చెదరగొట్టించారు‌. సంఘటన స్థలానికి ఎవరిని రాకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు పోలిసులు తీసుకున్నారు. ప్రభుత్వం భూమిలో అనుమతి లేకుండా ప్రతిష్టించిన బుద్ధ విగ్రహాన్ని భారీ పోలిస్ భద్రత మధ్య రెవెన్యూ అధికారులు వెంటనే విగ్రహాన్ని  తొలగించి, ముధోల్  తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ గొడవకు కారణం అయిన పలువురిని పోలిసులు అదుపులోకి తీసుకున్నారు. భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ముధోల్ సిఐ మల్లేష్ తో పాటు భారీ సంఖ్యలో పోలీసులు బోరేగంలో పికెటింగ్ తో పాటు, పోలిస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -