నవతెలంగాణ – కుభీర్
మండలంలోని నిగ్వ, హంపిలి సెరపెల్లి, కుప్టి గ్రామంలో ఇటీవల వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబ సభ్యులకు గురువారం ముధోల్ మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి మరియు నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శించారు. మృతి కి గల కారణాలు అడిగి తెలుసుకొని వారికి ప్రగాఢ సానుభూతి తెల్పి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆడుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చవాన్ మాజీ సర్పంచ్ మీరా విజయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చెర్మన్ డి రాములు,దత్తు, సాయబ్ రావు, ఆనంద్,దేవేందర్ సాయన్న, సుభాష్ గోపాల్ గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES