Friday, October 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ నిర్వసితులకు పరిహారం చెల్లించాలి

మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ నిర్వసితులకు పరిహారం చెల్లించాలి

- Advertisement -

తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు
నవతెలంగాణ – వనపర్తి 

వనపర్తి లోని సీఐటీయూ కార్యాలయంలో యు. గోపాల్ అధ్యక్షతన జరిగిన వ్యవసాయకార్మిక సంఘం ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశం కు తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు ముఖ్య అతితి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..పాలమూరు-రంగారెడ్డి కొడంగల్ నారాయణ పేట ప్రాజెక్ట్ ల బూ నిర్వసితుల కు మరియు ఆర్ ఆర్ ఆర్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులందరికి నేడు మార్కెట్ లో ఉన్న ధరలకు అనుగుణంగా పరిహారం చెల్లింపు తో పాటు ఇల్లు, కుటుంబం లో ఒకరికి ప్రభుత్వఉద్యోగం ఇవ్వాలని డీమాండ్ చేశారు. సాదా బైనా మా ద్వారా గతం లో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ వెంటనే కొత్త పాస్ బుక్కు లు ఇచ్చి, ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పతకలు వర్తింపచెయ్యాలని కోరారు.

ఏడాదికి భూమి లేని పేదలందరికి యేటా రూ.12000నగదు కు గాను కేవలం ఒక సారి మాత్రమే రూ.6000 కొంత మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవటం ఏమిటని విమర్శించారు. రేషన్ షాప్ ల ద్వారా 14రకాల నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల పతకం లో పెట్టిన నిబంధన ల వల్ల వేలాది మందికి ఇండ్లు మంజూరు అయినప్పటికీ నిర్మాణం చేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం హయం లల్లో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికి ఇప్పుడు ఇండ్లు ఇవ్వక పోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అర్వులున్నా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ డీమాండ్ చేశారు కొత్త గ్రామ పంచాయతీ లల్లో సీనియర్ మేటి లుగా చేస్తున్న వారిని ఫీల్డ్ అసిస్టెంట్ లు గా గురించా లని విజ్ఞప్తి చేశారు.

ఉపాధి హామీ పతకంసిబ్బంది కి నెల నెల రెగ్యులర్ గా వేతనాలు ఇవ్వాలని నెలల తరబడి పెండింగ్ లో ఉండడం వల్ల ఉపాధి లో ఆశిoచిన లక్షాలు సాదించాలలేరని అన్నారు ఈ సమావేశం లో వనపర్తి జిల్లా అధ్యక్షులు S. అజయ్ ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు. పోలె జగన్ కార్యదర్శి కడియాల మోహన్. నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు C. ఆంజనేయులు కార్యదర్శి నర్సింహా . జోగులాంబ గద్వాల్ జిల్లా కార్యదర్శి రేపల్లె దేవదాసు. వేణు గోపాల్. శివకుమార్ నాగరాజు. మల్లేష్ శివలిలాC. ప్రసాద్. సత్య నారాయణ. P. శంకర్. మౌలాలి తదితరులు.తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -