సంతాపం తెలిపిన సీజీఎం, ఎడిటర్, సిబ్బంది
నవతెలంగాణ-సంగారెడ్డి
నవతెలంగాణ ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్ డెస్క్ ఇన్‌చార్జి అనిల్ కుమార్ గుండెపోటుతో మృతిచెందారు. గురువారం సాయంత్రం అనిల్ సంగారెడ్డిలోని జిల్లా ఆఫీసులో విధులకు హాజరయ్యారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో తోటి సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ నిర్వహించారు. ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అనిల్‌కు సీపీఆర్ చేసి బతికించేందుకు తీవ్రంగా శ్రమించినా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం పట్ల నవతెలంగాణ దినపత్రిక సీజీఎం పి.ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్, మెదక్ రీజియన్ మేనేజర్ రేవంత్, ఉమ్మడి జిల్లా స్టాఫర్ దండు ప్రభు, బోర్డు సభ్యులు, సబ్‌ఎడిటర్లు, విలేకర్లు, సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనిల్ కుమార్ స్వగ్రామం సదాశివపేటలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
నవతెలంగాణ మెదక్ రీజియన్ డెస్క్ ఇన్‌చార్జి అనిల్ కుమార్ హఠాన్మరణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES