నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి బొడ్డుపల్లి నాగ అక్షయ 600కు 586 మార్కులు సాధించింది. వీరితో పాటు బి హర్షవర్ధన్ 576, ఎస్ మృణాళిని 572, సిహెచ్ జాహ్నవి 562, బి.అలేఖ్య 562,పి.ఋతిక 555, బి.రామ్ చరణ్ 554, ఆర్ నిశాంత్ 554,మార్కులు సాధించారు. అలాగే 100% ఉత్తీర్ణతతో పాటు 54 మంది విద్యార్థులకు గాను 37 మంది విద్యార్థులు 500 కు పైగా మార్కులను సాధించారు అని శ్రీ చైతన్య పాఠశాల ఆర్ఐ అన్నపూర్ణ కలెక్టర్ కు వివరించారు. అనంతరo అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాతో ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, డీన్ భీరేష్, పదవ తరగతి ఇంచార్జ్ వసంత్ గౌడ్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
విద్యార్థులను సన్మానించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -